
సోనిపట్ (హర్యానా): ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో అశోక యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి యోగేష్ జతేరి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసును నమోదు చేశారు. ఆదివారం ఢిల్లీలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మత విశ్వాసాలను అవమానించడం, మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించడంతో ఆయనను అరెస్టు చేశామని తెలిపారు.
ఈమేరకు అశోక యూనివర్సిటీ ఒక ప్రకటనను జారీ చేసింది. ‘‘ప్రొఫెసర్ అలీ ఖాన్‌ను ఆదివారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో అధికారులకు సహకరిస్తాం” అని పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వెల్లడించిన కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లను విమర్శిస్తూ అలీ ఖాన్ ట్వీట్‌చేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.