- ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : సమగ్ర కుటుంబ సర్వేలో తప్పులు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సిబ్బందికి సూచించారు. ఆదివారం మండల పరిధిలోని గుంపెన సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి, కట్టుగూడెంలో కుటుంబ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర ప్రసాద్, ఎంపీడీవో మహాలక్ష్మి, ఎంఈవో ఆనంద్ కుమార్, సొసైటీ చైర్మన్ సుధాకర్ రావు, పర్సా వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.