ఐసీసీ ర్యాంకింగ్స్..నెంబర్ వన్ బౌలర్ గా అశ్విన్

ఐసీసీ ర్యాంకింగ్స్..నెంబర్ వన్ బౌలర్ గా అశ్విన్

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో అశ్విన్ నెం.1 బౌలర్గా అవతరించాడు. మొత్తం 864 పాయింట్లతో  అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి రెండు టెస్టు్ల్లో అత్యధిక వికెట్లు దక్కించుకోవడంతో అశ్విన్ ను నెంబర్ వన్ ర్యాంకు వరించింది. అటు ఇంగ్లండ్ బౌలర్​ జేమ్స్ అండర్సన్‌ తన అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. ఈ జాబితాలో బుమ్రా (795) 4వ స్థానం,  (763) 8వ స్థానాన్ని దక్కించుకున్నారు. అశ్విన్ చివరి సారిగా 2015లో నంబర్​ వన్​ బౌలర్‌గా నిలిచాడు. 

బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో...

ఐసీసీ టెస్టు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ లబుషేన్ 912 పాయింట్లతో  అగ్రస్తానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్లో టీమిండియా వికెట్ కీపర్  రిషబ్ పంత్ 781 పాయింట్లు 8వ స్థానంలో, రోహిత్ శర్మ 777 పాయింట్లతో 9వ స్థానాల్లో నిలిచారు. 

ఆల్‌రౌండర్ల జాబితాలో.. 

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాలో  460 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. అశ్విన్ 376 పాయింట్లతో 2వ స్థానం, మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 283 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నాడు.