
న్యూఢిల్లీ: కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ను.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇవ్వాలన్న ఆలోచనను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విరమించుకుంది. ఈ మేరకు ఫ్రాంచైజీ కో ఓనర్ నెస్ వాడియా.. అశ్విన్‌ను కొనసాగిస్తున్నామని సోమవారం ప్రకటించాడు. గత రెండేళ్లుగా అశ్విన్
సారథ్యంలో పంజాబ్ మెరుగైన పెర్ఫామెన్స్ చేసిందని కొత్త కోచ్ అనిల్ కుంబ్లే కూడా భావిస్తుండటంతో ట్రేడింగ్ వ్యవహారాన్ని ఫ్రాంచైజీ పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.
‘అశ్విన్‌ను పంపించడం తెలివైన నిర్ణయం కాదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బోర్డు పునరాలోచన చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చర్చలు జరిగినా అంత సంతృప్తికరంగా సాగలేదు. అశ్విన్ సత్తా, సామర్థ్యం ఏంటో అతని ఆటే చెబుతుంది’ అని వాడియా పేర్కొన్నాడు.