
జనగామ జిల్లా: కరోనా మహమ్మారి జిల్లాలో మరో పోలీసు అధికారిని బలి తీసుకుంది. విధి నిర్వహణలో భాగంగా నిరంరతం ప్రజల మధ్య తిరగడంతో దేవరుప్పుల పోలీసు స్టేషన్ లో ఎఎస్ఐగా పనిచేస్తున్న కళాధర్ (55) అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు అస్పత్రిలో వైద్య చికిత్స కోసం తీసుకువెళ్లగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులు.. సహచర పోలీసు అధికారులు ధైర్యం చెప్పినా… ఒకింత ఆందోళనకు గురైన కళాధర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అదే ఆందోళనతో కోలుకోలేక కన్నుమూశాడు. కళాధర్ కరోనాతో మృతి చెందడంతో వైద్య సిబ్బంది.. సహచర పోలీసులు అలర్టయ్యారు. ఆయన తిరిగిన ప్రాంతాల్లో.. ఆయనను కలసిన వారు స్వచ్ఛందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. అవసరమైతే 14 రోజులు అందరితో దూరంగా.. హోం క్వారంటైన్ లో ఉండాలని.. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.