అయోధ్యపై సుప్రీం తీర్పుకు ఇవే కీలకం

అయోధ్యపై సుప్రీం తీర్పుకు ఇవే కీలకం

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు బీబీ లాల్ డైరక్టర్ జనరల్ గా ఉన్న సమయంలోనే  మొదటిసారి తవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాల్లో దేవాలయాన్ని పోలిన నిర్మాణం ఉన్నట్లు బీబీ లాల్ టీం కన్ ఫం చేసింది. బీబీ లాల్ చెప్పిన వివరాల ప్రకారం మసీదు కింది భాగంలో మందిరానికి వాడే 12 స్తంభాల ఆధారాలు దొరికాయి. 12, 13వ శతాబ్దాల నాటి ప్రతి ఆలయంలోనూ సహజంగా ‘పూర్ణ కలశం’  కనిపిస్తుంది. ఈ తవ్వకాల్లో ఇలాంటి పూర్ణ కలశాన్ని పోలిన  నిర్మాణాలు దొరికాయి. అలాగే మందిరానికి సంబంధించిన  ‘అష్ట మంగళ చిహ్నాలు’ కూడా లభించాయి. ఈ ఆధారాలను బట్టి మసీదు కింద గుడి ఉండేదన్న విషయం రుజువు అయింది. తమ తవ్వకాల ఉద్దేశం  మసీదు కింద గుడి ఉందా లేదా అనే విషయం చెప్పడానికి కాదు కాబట్టి, అప్పట్లో ఈ విషయాలను బీబీలాల్ నాయకత్వంలోని  టీం ప్రపంచానికి వెల్లడించలేదు. అయితే, 1990 ప్రాంతంలో గుడి పైన మసీదును నిర్మించారన్న వాదన కరెక్ట్ కాదన్న వాదన తెరమీదకు రావడంతో  తవ్వకాల టీంను లీడ్ చేసిన బీబీ లాల్ తొలిసారి నోరువిప్పి గుడిని పోలిన నిర్మాణం ఆనవాళ్లు దొరికినట్లు చెప్పారు.ాదాపు 130 ఏళ్ల నుంచి నలుగుతున్న వివాదానికి పరిష్కారం చూపించడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్​ ఇండియా  (ఏఎస్​ఐ) జరిపిన తవ్వకాలనే సుప్రీంకోర్టు ఆధారం చేసుకుంది. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో ఏఎస్ఐ మొత్తం రెండుసార్లు తవ్వకాలు జరిపింది. 1976–77లో మొదటిసారి, కట్టడం కూల్చేశాక 2003లో రెండోసారి పురావస్తు శాఖ ఈ తవ్వకాలు చేపట్టింది. మసీదును గుడి ఆనవాళ్లున్న ప్రదేశంపైనే నిర్మించినట్లు ఆధారాలు దొరికినట్లు  పురావస్తు శాఖ తవ్వకాల్లో పాల్గొన్న ఆర్కియాలజిస్టు బీబీ లాల్ వెల్లడించారు. అయోధ్య వివాదం నెలకొన్న ప్రదేశంలో మొత్తం రెండుసార్లు తవ్వకాలు జరిపితే , రెండుసార్లూ గుడి ఉందనడానికి  స్పష్టమైన ఆధారాలు దొరికాయన్నారు.

2003లో  రెండోసారి తవ్వకాలు

అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2003లో రెండో సారి ఆరునెలల పాటు పూర్తిగా సైంటిఫిక్ పద్ధతిలో తవ్వకాలు జరిపింది. మొదటిసారి జరిపిన తవ్వకాల్లో గుడికి సంబంధించిన 12 స్తంభాలు దొరికితే రెండోసారి తవ్వకాల్లో 50కి పైగా అటువంటి దొరికాయి.ఈ స్తంభాలు కూడా  17 వరుసల్లో ఉన్నాయి. దీంతో మసీదు కింద 12వ శతాబ్దానికి చెందిన ఓ పెద్ద గుడి ఉందనడానికి బలమైన ఆధారాలు పురావస్తు శాఖ కు లభించినట్లయింది. అయితే  రెండోసారి జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలపై కొంత వివాదం నెలకొంది. పురావస్తు శాఖకు పోటీగా వక్ఫ్ కమిటీ మరో టీం ను వివాదాస్పద స్థలానికి పంపింది. మసీదు కింద దొరికిన ఆధారాలన్నీ గుడికి సంబంధించినవి కావని, మరో మసీదువని వక్ఫ్ కమిటీ పంపిన టీం వాదించింది. ఈ వాదనను ఆర్కియాలజిస్టులు తోసిపుచ్చారు. తవ్వకాల్లో దొరికిన ఆధారాలు లేదా ఆనవాళ్లు వాస్తవంగా మసీదువే అయినట్టయితే టెర్రాకోట (మట్టి) విగ్రహాలు ఉండటానికి వీల్లేదన్నది ఆర్కియాలజిస్టుల వాదన. ఇస్లాంలో కుండలపై లేదా మట్టితో చేసిన ఇతర వస్తువులపై సజీవ చిత్రాలు వేయడం పూర్తిగా నిషిద్దం. దీంతో మసీదు కింద దొరికినవి మరో మసీదు ఆనవాళ్లు అనే వాదన తేలిపోయింది. ఇదిలాఉంటే మసీదు కింద దొరికిన ఆనవాళ్లు లేదా ఆధారాలు హిందూ మతానికి సంబంధించినవే కానక్కర్లేదని  కొంతమంది వాదించారు. , జైనిజం, బుద్దిజం ఆనవాళ్లుకూడా అయి ఉండొచ్చన్న  వాదన కూడా తెరమీదకు వచ్చింది. విష్ణువుకు సంబంధించిన శిలా శాసనాలు తవ్వకాల్లో దొరకడంతో  ఈ వాదన కూడా నిలవలేదు. తవ్వకాల్లో దొరికిన ఆధారాలన్నిటినీ ఒకచోట పెట్టి  చూస్తే మసీదు కింద గుడి ఉందన్న విషయం క్లియర్ గా అర్థమవుతోంది.