వ‌ణికించిన ధోని శిష్యుడు.. 164 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

వ‌ణికించిన ధోని శిష్యుడు.. 164 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి లంకేయులు.. ఆ జోరు కనబరిచారు. బంగ్లాదేశ్ బ్యాటర్లకు ఏ ఒక్క అవకాశమూ ఇవ్వని లంక బౌలర్లు.. బంగ్లా పులులను164 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా ఎంఎస్ ధోని శిష్యుడు, లంక యువ బౌలర్ మతీషా పతిరనా.. 4 వికెట్లు తీసి బంగ్లాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 

ఆసియా కప్ 2023లో భాగంగా పల్లకేలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా బ్యాటర్లు 164 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో(89) ఒక్కడే లంక బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. అతనొక్కడు 89 రన్స్ చేస్తే.. మిగిలిన పది మంది బ్యాటర్లు 67 పరుగులు చేశారు.

లంక బౌలర్లలో మతీశ పతిరానా 4 వికెట్లు తీసుకోగా.. మహేశ్ తీక్షణ 2, ధనంజయ డి సిల్వా, దసున్ షనక, దునిత్ వెల్లలాగే తలా వికెట్ తీసుకున్నారు.