డ్రగ్స్‌ వ్యాపారం.. రూ.4 లక్షల కోట్ల దందా

డ్రగ్స్‌ వ్యాపారం.. రూ.4 లక్షల కోట్ల దందా
  • ఆసియాలో ఏటా డ్రగ్స్‌ వ్యాపారం విలువ రూ.4.21 లక్షల కోట్లు
  • స్మగ్లింగ్ గ్యాంగులతో ఆయా దేశాలు ఇబ్బంది
  • అడవుల్లోని గుహల్లో దాస్తున్న డ్రగ్స్‌ ముఠాలు

అది థాయ్ లాండ్ లోని ఉత్తర చియాంగ్ మయ్ ప్రావిన్సు. దట్టమైన అడవులకు ఆ ప్రాంతం బాగా ఫేమస్. ఓ అడవిలో ఆ దేశ ఆర్మీ తీవ్రంగా గాలిస్తోంది. రోజులు గడిచాయి. కొండలు, కోనలు దాటి వెళుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఓ గుహ కనిపించింది. అందులోకి వెళ్తే లోపలంతా పేద్ద పేద్ద గోతాలు. తెరిచి చూస్తే మిథాంఫిటామైన్ ట్యాబ్లెట్లు. వీటిని మ్యాడ్ నెస్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు. దాదాపు 50 లక్షల బిళ్లలు దొరికాయి. నట్టడవిలో ఎలాంటి భద్రతా లేకుండా మ్యాడ్ నెస్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాచారని పోలీసు లెఫ్టినెంట్ కల్నల్ దిలోక్ పేర్కొన్నారు. సీజ్ చేసిన ట్యాబ్లెట్ల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.

యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్ఓడీసీ) ప్రకారం తూర్పు, నైరుతి ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏటా 2.1 లక్షల నుంచి 4.21 లక్షల కోట్ల రూపాయల మేర మిథాంఫిటామైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాబ్లెట్ల వ్యాపారం జరుగుతోంది. మామూలుగా ఒక్కో ట్యాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాలా ఖర్చవుతుంది. కానీ అక్రమ రవాణాలో వీటిని డెడ్ చీప్ రేట్లకు అమ్ముతున్నారు. దీంతో సుదూరంలో ఉన్న న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైతం వీటి రవాణా పెరిగిపోయింది. నైరుతి ఆసియాలో డ్రగ్స్ స్మగ్లింగ్ పెరగడానికి కారణం ఇక్కడి దేశాల్లో నెలకొన్న వాతావరణమేనని యూఎన్ఓడీసీ పెద్దాఫీసర్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా చాలా రెబెల్ గ్రూపులు, వార్ లార్డ్స్ ఇతరులు ట్యాబ్లెట్ల స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఆదాయాన్ని చూసి, ఏకమయ్యాయని తెలిపారు.

అంతకుముందు ఈ గ్రూపులన్నీ ఓపియం, హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసేవని యూఎన్ఓడీసీ వెల్లడించింది. మయన్మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షాన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ‘మిథాంఫిటామైన్ ట్యాబ్లెట్ల’ స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉపకరించేలా ఉన్నాయని పేర్కొన్నారు. పైగా మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆ దేశంలో ఉన్న చట్టాలతో స్మగ్లర్లను పట్టుకోవడం కష్టమని వివరించారు. ఇటీవల మయన్మార్ లో కొత్త హైవేలు, బ్రిడ్జిలను కట్టారు. వీటి ద్వారా కెమికల్స్ ను వేగంగా రవాణా చేసుకుని, మిథాంఫిటామైన్ ట్యాబ్లెట్లను తయారు చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసు ఇంటెలిజెన్స్ పేర్కొంది. థాయ్ లాండ్ నుంచి చైనాకు ఆర్3ఏ హైవేను 2011లో కట్టారు. చైనా తన ప్రొడక్టులను నైరుతి ఆసియాలోకి తెచ్చేందుకు ఈ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుతోంది. అయితే, 2015 నుంచి కొత్త చిక్కు వచ్చి పడింది. ఇదే ముసుగులో స్మగ్లర్లు మిథాంఫెటామైన్ ట్యాబ్లెట్లను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. 2018లో దాదాపు 51.5 కోట్ల ట్యాబ్లెట్లను ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో పట్టుబడిందని యూఎన్ఓడీసీ పేర్కొంది. ఇందులో సగానికి పైగా థాయ్ లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీజ్ చేసిందేనని తెలిపింది.

డెడ్ చీప్ రేట్లు

‘తక్కువ ధర ఉంటే ఎక్కువ ప్రొడక్టు అమ్ముడవుతుంది’ ఈ ఫార్ములానే స్మగ్లర్లు ఫాలో అవుతున్నారట. మిథాంఫిటామైన్ ట్యాబ్లెట్లను 20 ఏళ్ల క్రితం మార్కెట్లో ఉన్న ధరలకు అమ్ముతున్నారు. థాయ్ లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక ట్యాబ్లెట్ 60 రూపాయలకే దొరుకుతోంది. ఇలా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్మగ్లింగ్ ముఠాలు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నాయి. వీటిలోనూ నాణ్యత ఉందట. తక్కువ ధరకు దొరికేవైతే తక్కువ కిక్కు, ఎక్కువుంటే ఎక్కువ కిక్కు ఉంటున్నాయట. అందుకే ఖరీదైన వాటిని  డబ్బు ఎక్కువ పెట్టి కొనుక్కునే ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియాకు  స్మగ్లింగ్ చేస్తున్నారట. జపాన్ లో ఒక గ్రాము మిథంఫెటామైన్ ట్యాబ్లెట్ విలువ రూ.38 వేలు, దక్షిణ కొరియాలో రూ.26 వేలు, అమెరికాలో రూ.4800కు అమ్ముతున్నారని యూఎన్ఓడీసీ పేర్కొంది.

థాయ్‌లాండే ముందు

ఫిలిప్పీన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్ లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఫెటామైన్ ట్యాబ్లెట్లు కోసం రకరకాల గ్యాంగ్స్ మధ్య చిన్న స్థాయి యుద్ధాలు జరుగుతుంటాయి. వీటిని కట్టడి చేయడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు సరిహద్దులు, కస్టమ్స్ నిఘా పెంచాయి. థాయ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటించింది. ప్రత్యేక వింగ్స్ ఏర్పాటు చేసి మిథంఫెటామైన్ ట్యాబ్లెట్లను భారీగా పట్టుకుంటోంది. అందులో భాగంగానే అడవుల్లోకి వెళ్లి మరీ ట్యాబ్లెట్లను పట్టుకుంది.