బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా రెజ్లర్లు హన్సిక లంబా, నేహా కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. గురువారం జరిగిన విమెన్స్ 55 కేజీల ప్లే ఆఫ్స్ బౌట్‌లో హన్సిక 6–1తో అరుకి కడియార్‌బెక్ (కిర్గిస్తాన్)పై గెలిచింది. రెండో రౌండ్‌లో లెగ్ ఎటాక్ ద్వారా పాయింట్లు నెగ్గి బౌట్‌లో పైచేయి సాధించింది. 59 కేజీల బ్రాంజ్ బౌట్‌లో నేహా 10–4తో బోలోరుతుయా కురెలెక్ (మంగోలియా)పై నెగ్గింది. 53 కేజీల సెమీస్‌లో మీనాక్షి గోయత్ 4–2తో పార్క్ సెయెంగ్ (సౌత్ కొరియా)పై గెలిచి ఫైనల్‌కు చేరింది. చివరి 30 సెకన్ల వరకు 0–2తో వెనకబడిన మీనాక్షి తర్వాత పుంజుకుంది. బలమైన అటాకింగ్‌తో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గింది.
