- కలెక్టర్ హరిత హెచ్చరిక
ఆసిఫాబాద్, వెలుగు: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆసిఫాబాద్కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించి వార్డులు, పలు విభాగాలను పరిశీలించారు. అందిస్తున్న వైద్య సేవలపై చికిత్స పొందుతున్న రోగులను ఆరా తీశారు. రక్త నిల్వ గదిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారితో మర్యాదగా వ్యవహరించాలన్నారు. సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. రోగులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలని, శుద్ధమైన తాగునీరు అందించాలని సూచించారు.
