స్టూడెంట్లు సైంటిస్టులుగా ఎదగాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

స్టూడెంట్లు సైంటిస్టులుగా ఎదగాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: స్టూడెంట్స్ సైంటిస్టులుగా ఎదగాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ హైస్కూల్​లో గురువారం జిల్లా స్థాయి ఇన్​స్పైర్ మనాక్, 52వ బాల వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీఈవో యాదయ్యతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సైన్స్, మ్యాథ్స్​ను ఇష్టపడి చదవాలన్నారు.

సమస్యకు పరిష్కారం చూపడం, ఆలోచించి ఉత్తమ నిర్ణయాలు తీసుకునేందుకు సైన్స్, గణితం ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రదర్శన శాలలను ప్రారంభించారు. ప్రాజెక్టులను పరిశీలించి వాటి గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నిర్వహించిన  సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.