ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధికి చేస్తా :  విష్ణు వర్ధన్ రెడ్డి

ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధికి చేస్తా :  విష్ణు వర్ధన్ రెడ్డి

షాద్ నగర్, వెలుగు: మీలో ఒక్కరిగా ఉంటా నని తనను ఆదరించి ఎమ్మెల్యేగా  గెలిపించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం చౌదర్‌‌‌‌గూడ   మండలంలోని ఏదిరా, రావిర్యాల, వీరసముద్రం, గుర్రంపల్లి, ఇంద్రనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..  అభివృద్ధి అంటే నాయకులు ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం కాదని, గ్రామాలు, మున్సిపాలిటీ, ప్రజలు అభివృద్ధి చెందాలని అన్నారు.

తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం  ప్రజల్లో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు.  నవంబర్ 30న జరగబోయే ఎన్నికల్లో  సింహం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.  కార్యక్రమంలో రాజు, మల్లేశ్, విఠల్ నాయక్‌‌, శ్రవణ్ తదితరులున్నారు.