రాహుల్ గెలిస్తే ఏ తప్పుండదు.. బీజేపీ గెలిస్తే తప్పు జరిగినట్టా?

రాహుల్ గెలిస్తే ఏ తప్పుండదు..  బీజేపీ గెలిస్తే  తప్పు జరిగినట్టా?
  • అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

గువహటి: బీజేపీ గెలిచిన ప్రతిసారీ ఎన్నికల ప్రక్రియలో తప్పులు జరిగాయని ఆరోపించడం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. దేశంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని రాహుల్ ​గాంధీ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం హిమంత స్పందించారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో గెలిచినప్పుడు.. అంతా బాగానే ఉంటుందని, బీజేపీ గెలిచినప్పుడు మాత్రం తప్పు జరుగుతుందా? అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణలో ‘ఓటు చోరీ’ జరగలేదా? బీజేపీ గెలిస్తే మాత్రం ‘ఓటు చోరీ’ జరుగుతుందా” అని ఆయన నిలదీశారు.