ఐపీఎస్ పాసైన కూతురుకు డీజీపీ సెల్యూట్

ఐపీఎస్ పాసైన కూతురుకు డీజీపీ సెల్యూట్

ప్రతీ తల్లిదండ్రులు తమ బిడ్డ జీవితంలో విజయం సాధించాలని, వారి కలలను నెరవేర్చాలని కోరుకుంటారు. పిల్లల అభివృద్ధే తల్లిదండ్రులకు అంతిమ లక్ష్యంగా పని చేస్తారు. అది సాధించినపుడు వారి ఆనందానికి అవధులుండవు. ఇటీవల అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కూడా ఇలాంటి భావోద్వేగ క్షణాన్ని ఎక్స్ పీరియన్స్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుండి ఉత్తీర్ణురాలైన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ఐశ్వర్య సింగ్  పాసింగ్ అవుట్ పరేడ్ అనంతరం తన తండ్రి, డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఆమెకు సెల్యూట్ చేశారు. తన కూతురును అభినందించే ఈ వీడియోను డీజీపీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో వారిద్దరూ ఒకరికొకరు నమస్కారం చేసుకుంటూ, గర్వంగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. దాంతో పాటు ఈ క్షణాన్ని వర్ణించేందుకు పదాలు లేవనే క్యాప్షన్ ను జోడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ క్షణం తండ్రీ, -కూతురికి ఎంతో గర్వకారణమైన రోజు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.