
హైదరాబాద్ : రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సభ ప్రారంభం కాగానే మాజీ గవర్నర్ ND తివారీతో సహా 16 మంది దివంగత ఎమ్మెల్యేకు సంతాపం తెలపనుంది అసెంబ్లీ. ఆ తర్వాత అటవీ చట్ట సవరణ బిల్లును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభలో ప్రవేశ పెట్టనున్నారు. తర్వాత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ పై అధికార, విపక్షాలు ఇవాళ చర్చించనున్నాయి.