Nora Fatehi Health Update: హీరోయిన్ కారును ఢీకొన్న డ్రంక్ డ్రైవర్.. హెచ్చరిస్తూ వీడియో రిలీజ్

Nora Fatehi Health Update: హీరోయిన్ కారును ఢీకొన్న డ్రంక్ డ్రైవర్.. హెచ్చరిస్తూ వీడియో రిలీజ్

బాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి పెను ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడింది. ముంబైలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రముఖ అమెరికన్ డీజే డేవిడ్ గెట్టా 'సన్బర్న్' సంగీత కచేరీకి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఒక డ్రైవర్ వేగంగా వచ్చి ఆమె కారును ఢీకొడ్డాడు. వెంటనే ఆమె సిబ్బంది అప్రమత్తమై సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రమాదం లేదని, స్వల్ప కంకషన్ (ఒక్కసారిగా తల తిరిగి మతి భ్రమించి నట్లు కావడం) మాత్రమేనని నిర్ధారించారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ, ఆమె మాత్రం సన్బర్న్ 2025 వేదికపై ప్రదర్శన ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ ప్రస్తుతం తాను బాగానే ఉన్నట్లు వెల్లడించింది. అలాగే ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసి అభిమానులను ఆందోళన చెందోద్దంటూ తెలిపింది.

‘‘రీసెంట్​గా జరిగిన రోడ్డు యాక్సిడెంట్​ నుంచి నేను క్షేమంగా బయటపడ్డాను. స్వల్ప గాయాలైనా ప్రస్తుతం బాగానే ఉన్నాను. మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తి నా వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో నా వెహికిల్ డ్యామేజ్ అయ్యింది. దయచేసి ఎవరూ కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయకండి’’ అని హెచ్చరిస్తూ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ప్రస్తుతం నోరా చేతిలో 'కాంచన 4', 'కేడీ: ది డెవిల్' వంటి భారీ సౌత్ ప్రాజెక్టులతో పాటు ఇషాన్ ఖట్టర్​తో కలిసి చేస్తున్న 'ది రాయల్స్' అనే వెబ్ సిరీస్ కూడా ఉంది.