సర్పంచ్ గా తండ్రి గెలుపు..వినూత్నంగా మొక్కు తీర్చుకున్న కొడుకు

సర్పంచ్ గా తండ్రి గెలుపు..వినూత్నంగా మొక్కు తీర్చుకున్న కొడుకు

ఎన్నికల టైంలో వాగ్దానాలు వింతవింతగా ఉంటాయి.. స్థానికల సంస్థల ఎన్నికలు ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అయితే మరీ వింతగా ఉంటాయి. ఈసారి  సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన హామీలు మరీవింతగా ఉన్నాయి. నన్ను వార్డు మెంబర్ గా గెలిపిస్తే.. ఊరంతా ఫ్రీ వైఫై పెట్టిస్తానని ఒకాయన.. ఉచింతంగా కటింగ్ చేస్తానని ఇంకొకాయన.. ఏకంగా హామీలను  తప్పకుండా నెరవేరుస్తానని బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారు అభ్యర్థులు.. ఇదిలా ఉంటే  మెదక్ జిల్లాలో తండ్రి పెద్దకొడుకు సర్పంచ్ గా పోటీ పడితే.. చిన్నకొడుకు వింత మొక్కు మొక్కుకున్నాడు. ఆ తండ్రి గెలిచాడు.. మరీ  కొడుకు ఆ మొక్కు నెరవేర్చాడా? వివరాల్లోకి వెళితే.. 

అది మెదక్ జిల్లాలో రామాయం పేట మండలంలోని జాన్సి లిం గాపూర్ గ్రామం.. ఇటీవల జరిగి న సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామానికి చెందిన రాంకిష్టయ్య, అతని పెద్ద కుమారు డు సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది.. ఈ క్రమంలో తన తండ్రి గెలిస్తే కర్ణాటకకు వెళ్లి ఆలయంలో అన్న ప్రసాద వితరణ చేస్తానని మొక్కుకున్నాడు రాంకిష్టయ్య చిన్న కుమారుడు భాస్కర్. భాస్కర్ కోరుకున్నట్లుగానే తండ్రి రాంకిష్టయ్య అతని పెద్ద కుమారుడు వెంకటేష్ పై గెలిచి సర్పంచ్ అయ్యాడు. దీంతో తన మొక్కు తీర్చుకునేందుకు భాస్కర్ అందరూ ఆశ్చర్యపోయేలా బిక్షాటన చేస్తున్నాడు. 

భుజానికి జోలే, చేతిలో కర్రతో కాళ్లకు చెప్పులు లేకుండాభాస్కర్ సొంత గ్రామంలో బిక్షాటన చేశాడు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి  భవతీ బిక్షాందేహీ అంటూ జోలె పట్టి అడుకున్నాడు. ఇక గ్రామస్తులు మొదట్లో కొంత ఆశ్చర్యం, విస్మయంతో చూసినా తండ్రి కోసం అతని చేసిన పనిని క్రమంగా సమ్మతించారు. తమకు తోచిన సాయం చేస్తున్నారు గ్రామస్తులు.