తిరుమల శ్రీవారి భక్తుల భద్రతను టీటీడీ అధికారులు కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 20 బ్రెత్ అనలైజర్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అందించారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఆదివారం .. ఈవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు , టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు .. వాహనాల భద్రతకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీటిలో భాగంగా రూ.8లక్షల విలువైన 20 బ్రెత్ ఎనలైజర్లు జిల్లా ఎస్పీ కి అందించామని చెప్పారు.
టీటీడీ భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తుoదన్నారు. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా పోలీస్ శాఖకు అత్యాధునిక పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ బ్రీత్ అనలైజర్ల పనితీరును ఈవోకు వివరించారు. మొత్తం 20 పరికరాలలో నాలుగు తిరుమల..నాలుగు అలిపిరి, మిగిలిన12 తిరుపతిలో పోలీస్ శాఖ వినియోగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, తిరుమలకు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు
