
హైదరాబాద్ : అసెంబ్లీ, ఎర్రమంజిల్ భవనాలు హైదరాబాద్ చరిత్రకు ఆనవాళ్లన్నారు సోషల్ సైంటిస్ట్ రామచంద్రయ్య, వాటిని కాపాడుకుంటేనే హైదరాబాద్ విశిష్టత నిలుస్తుందన్నారు. భవనాలు కూల్చివేస్తే….హైదరాబాద్ తనకున్న ప్రత్యేక గుర్తింపును కోల్పోతుందని తెలిపారు. ఉన్న భవనాలతో ఇబ్బందేమిటో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. కొత్త భవనాల నిర్మాణానికి సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.