
బషీర్‌బాగ్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమ బంగారం నిల్వలపై జీఎస్టీ అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం అబిడ్స్‌లోని శ్రీ శుభం జువెలరీ షాపులో జీఎస్టీ డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేశారు.
సుమారు 6 గంటల పాటు నిర్వహించిన సోదాల్లో జీఎస్టీ చెల్లించని 4 కేజీల బంగారు ఆభరణాలను గుర్తించారు. జువెలరీ షాప్ యజమానికి నోటీసులు ఇచ్చారు. బంగారు ఆభరణాలపై జీఎస్టీతో పాటు ఫైన్ విధించినట్లు అధికారులు తెలిపారు.