అసెంబ్లీ 20 రోజులు నడుస్తుంది: మండలి చైర్మన్ గుత్తా

అసెంబ్లీ 20 రోజులు నడుస్తుంది: మండలి చైర్మన్ గుత్తా

బిఎసి ఫైనల్ నిర్ణయం..

ఈ సభలో  4 బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది

హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈసారి అసెంబ్లీ సమావేశాలు 20 రోజులపాటు నడుస్తాయని.. ఇది బీఏసీ ఫైనల్ నిర్ణయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. 20 రోజులు అసెంబ్లీలో సభలు నడుస్తాయి.. బిఎసి ఫైనల్ నిర్ణయం… ఈ సభలో  4 బిల్లులు సభకు వచ్చే అవకాశం ఉంది… సభ కోవిడ్ నిబంధనల ప్రకారం జరుగుతుంది. థర్మల్ స్క్రినింగ్.. మాస్క్ అండ్ టెంపరేషర్ చెప్పే యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోషల్ డిస్టన్స్ ఉండే విదంగా సీటింగ్ ఉంటుందని.. కొత్తవి 8 సీట్లను మండలిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రెస్ గ్యాలరీలో కూడా సోషల్ డిస్టన్స్ ఉంటుంది… ప్రెస్ గ్యాలరీ తోపాటు విజిటర్స్ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ చట్టాన్ని సభలో తేవాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ ని నేను మూడు- నాలుగు సార్లు కలిశాను… పివి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కలిశానని చెప్పారు. మాజీ మంత్రి మోహన్ రెడ్డి భూమి 17 గుంటలు పుల్లాయి పల్లి కెనాల్ పోతుంది…  నర్సింహారెడ్డి..  మోహన్ రెడ్డి..  మరొకరిది భూమి పోతుంది…  ఎకరాల భూమి కెనాల్ లో పోయినా గొడవ లేదు… 17 గుంటల దగ్గర గొడవ జరిగింది… చిన్న విషయం పెద్దగా మారింది.. తుపాకీ బయటకు తీసిన వీడియో బయటకు వచ్చిందని వివరించారు.

కృష్ణ వాటర్ పై తెలంగాణ సర్కార్ న్యాయపరంగా ముందుకు వెళ్తుందని.. కృష్ణా నది నీళ్లను అక్రమంగా ఏపీ తీసుకుపోతామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. గతంలో ఆర్డీఎస్ కెనాల్ జరిగే సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు జరిగాయని గుర్తు చేసుకున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అనేది ఇల్లీగల్.. దానికి అదనంగా రాయలసీమ లిఫ్ట్ అనేది తప్పు… పోతిరెడ్డిపాడు అంశం అప్పుడు కాంగ్రెస్ లో  ఉంటూనే నేను, జానారెడ్డి లెటర్స్ రాసాము… అప్పటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంత మంత్రులు ఒక్కరూ మాట్లాడలేదు… టీడీపీ ప్రభుత్వం హయాంలో దేవాదుల ప్రాజెక్టు దగ్గర కూడా వివాదం జరిగిందన్నారు. రీ-డిజైన్ ప్రాజెక్టులన్నీ గోదావరి నదిపైనే జరిగాయి- జరుగుతున్నాయని.. తెలంగాణలో ఎన్ని నీళ్లు తేవాలన్నా లిఫ్ట్ ద్వారా మాత్రమే తేవాల్సి ఉంటుంది.. కృష్ణా నది పై తెలంగాణ-ఏపీ-కర్ణాటక-మహారాష్ట్ర ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. శ్రీశైలం విద్యుత్ సంఘటన పై ప్రతి పక్షాల విమర్శలు కరెక్ట్ కాదు… జరిగిన సంఘటన అనేది మానవ తప్పిదామా? ఇతర కారణాల అనేది విచారణ జరుగుతోంది.. శ్రీశైల విద్యుత్ అనేది తెలంగాణ జీవనాడి లాంటిదని మండలి ఛైర్మన్ పేర్కొన్నారు.

కేసీఆర్ నాకు ఏ భాద్యత అప్పగిస్తే అది నిర్వర్తిస్తా… నాకు వచ్చిన రాజ్యాంగ పదవిలో సంతృప్తి గా ఉన్నా… కేసీఆర్ ఉద్యమ కారులకు అన్యాయం చెయ్యరు అనేది నా నమ్మకం… రాజకీయ సమీకరణలో ఇతర పార్టీ నేతలను పార్టీలో చేర్చుకోవడం తప్పదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. మంత్రి కేటీఆర్ అన్ని పదవులకు సమర్దుడేనని ఆయన స్పష్టం చేశారు.