ఖలిస్థాన్ టెర్రరిస్ట్ లఖ్​బీర్​సింగ్​ఆస్తులు జప్తు

ఖలిస్థాన్ టెర్రరిస్ట్ లఖ్​బీర్​సింగ్​ఆస్తులు జప్తు

న్యూఢిల్లీ: ఖలిస్థానీ టెర్రరిస్ట్ లఖ్​బీర్​ రోడే ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్  ఏజెన్సీ(ఎన్ఐఏ) జప్తు చేసింది. బుధవారం పంజాబ్​లోని మెగాలో లఖ్​బీర్ సింగ్ కు సంబంధించిన ప్రాంగణాలపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. అతని పేరుమీదున్న ఆస్తులను, 1.4 ఎకరాల స్థలాన్ని జప్తు చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

టర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ అధినేత అయిన లఖ్​బీర్ సింగ్​ను కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్ట్​గా ప్రకటించింది. ఇతను ఖలిస్థాన్​ ఉద్యమానికి నాయకత్వం వహించిన జర్నైల్ సిగ్ భింద్రన్​వాలే మేనల్లుడు.