
హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్(ఏపీపీ) నియామకాలకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 151 ఏపీపీ(కేటగిరి–7) పోస్టుల భర్తీకి టీఎస్‌ఎల్పీఆర్‌బీ చైర్మన్ శ్రీనివాస్ రావు ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 53 మంది మహిళా ఏపీపీలకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించనున్నట్లు తెలిపారు. www.tslprb.inలో అప్లికేషన్ ప్రొఫర్మాను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. అప్లికేషన్స్, ఖాళీలు,సెలక్షన్స్‌కు సంబంధించి వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 34 ఏండ్లకు మించకూడదు. బ్యాచిలర్ డిగ్రీ, లా (ఎల్‌ఎల్‌బీ/బీఎల్), ఇంటర్మీడియట్ తర్వాత ఐదేళ్ల లా కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అలాగే క్రిమినల్ కోర్టుల్లో మూడేండ్లకు తగ్గకుండా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ .750, ఇతరులకు రూ.1,500లుగా ఫీజు నిర్ణయించారు.