భూమికి దగ్గరగా ఆస్టరాయిడ్​

భూమికి దగ్గరగా  ఆస్టరాయిడ్​

అంతరిక్షంలో తిరుగుతున్న గ్రహశకలం ఒకటి ఈ నెల 15న భూమి సమీపంలో నుంచి దూసుకెళ్లనుంది. సైంటిస్టులు దీనిని ‘2020 డీబీ5’ గా వ్యవహరిస్తున్నారు. ఇది దాదాపు ఓ కిలోమీటర్​ అంత ఉంటుందని చెప్పారు. ఈ ఆస్టరాయిడ్​ గంటకు 34 వేల కి.మీ. వేగంతో భూమికి దాదాపు 43 లక్షల కిలోమీటర్ల చేరువలోకి రానుందట.

1995లో ఇదే గ్రహశకలం భూమి సమీపంలో నుంచి వెళ్లిపోయిందని, ఈ నెల 15 తర్వాత మళ్లీ 2048 మే 2న భూమికి దగ్గరగా వస్తుందని వివరించారు. అదేవిధంగా, ‘1994 ఎక్స్ డి’ అనే మరో గ్రహశకలం సోమవారం భూమి పక్క నుంచి దూసుకెళ్లిందని నాసా సైంటిస్టులు తెలిపారు.

2012లో ఇదే ఆస్టరాయిడ్​ భూమికి దగ్గరగా వచ్చిందని, మళ్లీ 2030లో మరోమారు భూమి పక్క నుంచి వెళ్తుందని వివరించారు. ఇది గంటకు 77 వేల కిలోమీటర్ల వేగంతో సుమారు 32 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుందని పేర్కొన్నారు.