జ్యోతిష్యం :  సింహరాశి లోకి కేతువు.. మూడు రాశుల వారికి దశ మారుతుంది..! 

జ్యోతిష్యం :  సింహరాశి లోకి కేతువు.. మూడు రాశుల వారికి దశ మారుతుంది..! 

జ్యోతిష్య శాస్త్రంలో  ప్రతి గ్రహం  అది ఏ రాశిలో ఏ సమయంలో ప్రవేశించింది.. అప్పుడు ఏ నక్షత్రం ఉంది. ఇలా కొన్ని అంశాల ఆధారంగా వ్యక్తిగత జాతకాన్ని పండితులు చెబుతున్నారు.  నవగ్రహాల్లో కేతువు సాధారణంగా చెడు ప్రభావాలను కలుగజేస్తాడు.  కాని కేతువు మఘ నక్షత్రాని అధిపతి.. ఆ సమయంలో సహజంగా కేతువు చెడు ప్రభావాలను చూపడని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 29 వ తేదీన ఉదయం 8.37 నిమిషాలకు కేతువు మఘ నక్షత్ర లగ్నంలో  సింహరాశిలోకి ప్రవేశించి.. ఇదే రాశిలో 2026 డిసెంబర్​ 5 వ తేది వరకు సంచరిస్తాడు. దీని ప్రభావం వలన  కొన్ని రాశుల వారికి   జీవితంలో ఆకస్మిక మార్పులు, రహస్యాలు, వైరాగ్యం వంటి అనుభవాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఎవరైనా జాతకంలో కేతువు బలంగా ఉన్న వారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం...

మేష రాశి: కేతువు మఖ నక్షత్రంలో.. సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి.. జీవితంలో పురోగతి సాధిస్తారు.  వ్యాపారస్తులు మంచి లాభాలు వస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.  పెట్టుబడులు పెడితే అదనంగా లాభాలు వస్తాయి.  ఉద్యోగస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  కార్యాలయంలో మీ మాట నెగ్గుతుంది.  ఎలాంటి ఆదోళనలేకుండా జీవితం సాఫీగా సాగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

సింహ రాశి : ఇదే రాశిలో కేతువు సంచారం వలన ఈ రాశి వారికి  ఎంతో శుభం కలుగుతుంది.  మఖ నక్షత్రం ఈ రాశికి చెందినది కావడంతలో మంచి లాభాలు.. అభివృద్ది ఉంటాయి.  గతంలో పెట్టిన పెట్డుబడులకు ఇప్పుడు లాభాలొస్తాయి.  ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశంఉంది.  విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. వ్యాపారస్తులకు ఈ సమయం బాగా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. కుటుంబంలో గొడవలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తి చేతికి వస్తుంది. 

ధనుస్సు రాశి : కేతువు సింహరాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారు గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. ఇప్పటి వరకు మందకొడిగా సాగిన వ్యాపారం ఒక్కసారిగా పుంజుకుంటుంది.  ఉద్యోగస్తులు  కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.  ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.