- హాజరైన సీఎం, మంత్రులు
హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
బీజేపీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకాగా.. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ ఎల్.రమణ ఒక్కరే హాజరయ్యారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఇతర ముఖ్య నేతలెవరూ రాలేదు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా, ఆయన రాలేకపోయారు.
జెండా ఎగురవేసిన గవర్నర్..
రాజ్ భవన్ లో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంతో మంది మహానీయుల పోరాటంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన అన్నారు.
