రాజస్థాన్లో ఘోరం: ఆగి ఉన్న వ్యాన్ను ఢీ కొన్న కంటైనర్.. 11 మంది మృతి

రాజస్థాన్లో ఘోరం: ఆగి ఉన్న వ్యాన్ను ఢీ కొన్న కంటైనర్.. 11 మంది మృతి

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆగి ఉన్న వ్యాన్ ను కంటైనర్ ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. దౌసా మనోహర్ పూర్ రోడ్డులో ఆగి ఉన్న వ్యాన్ ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది భక్తుల బృందం ఖాఠుశ్యామ్ ఆలయం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో మరణించినవారిలో ఏడుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని అసుప్తరికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ప్రమాదం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు సీఎం భజన్ లాల్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు భజన్ లాల్. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.