కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి

ఇండోనేషియాలో భారీ వర్షాలకు రెండు కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 12 మంది చనిపోయారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  పశ్చిమ జావాలో  సిహాంజంగ్ గ్రామంలో  శనివారం మధ్యాహ్నం కొండచరియలు విరిగి పడ్డాయి..సహాయక చర్యలు కొనసాగుతుండగానే  సాయంత్రం మరో కొండ చర్య విరిగిపడింది. రెస్క్యూ టీం సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. వంతెనపై కొండ చరియలు విరగడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.  భారీ యంత్రాలను తరలించడానికి అవకాశం లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

అధిక వర్షపాతం, అస్థిర నేల పరిస్థితుల కారణంగా మొదటి కొండచరియలు విరిగిపడ్డాయని జాతీయ విపత్తు నిర్వహణ ఏజెన్సీ ప్రతినిధి రాదిత్య జతి అన్నారు. మొదటి కొండచరియ ప్రాంతంలో అధికారులు బాధితులను తరలిస్తుండగా మరో  కొండచరియ  విరిగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.