బస్సులో మంటలు.. 45 మంది మృతి

బస్సులో మంటలు.. 45 మంది మృతి

బల్గేరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ని హైవేపై నార్త్ మెసిడోనియన్ లైసెన్స్‌ ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 45 మంది మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ప్రమాద బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. కాలిన గాయాలతో  ఉన్న ఏడుగురిని రాజధాని సోఫియాలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్నిమాపక భద్రతా విభాగానికి చెందిన అంతర్గత మంత్రిత్వ శాఖ అధిపతి నికోలాయ్ నికోలోవ్ వెల్లడించారు.

ప్రమాదానికి గురైన బస్సు టర్కీ నుంచి ఇస్తాంబుల్ మీదుగా నార్త్ మెసినోనియన్ ప్రాంతాలోని స్కోప్జ్ ప్రాంతానికి వెళ్తుంది. బస్సులో 12 మంది పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు బస్తు బోల్తాపడటంతో అగ్నిప్రమాదం జరిగిందో లేదా అగ్నిప్రమాదం జరిగాక బొల్తాపడిందనేది ఇంకా స్పష్టం కాలేదని నికోలోవ్‌ చెప్పారు. అయితే ఈ ప్రమాదం తెల్లవారుఝామున సుమారు 2 గంటల ప్రాంతంతో జరిగిందని అన్నారు. పైగా బాధితుల్లో ఎక్కువ మంది నార్త్ మాసిడోనియాకు చెందిన వారేనని సోఫియాలోని నార్త్ మెసిడోనియా రాయబార కార్యాలయ అధికారి తెలిపారు.