షాకింగ్ లుక్స్ : 60 ఏళ్లలో.. 22 ఏళ్ల అమ్మాయిలా ఫిట్..

షాకింగ్ లుక్స్ : 60 ఏళ్లలో.. 22 ఏళ్ల అమ్మాయిలా ఫిట్..

ప్రపంచంలో చాలా రకాల వ్యక్తులు ఉంటారు. కొందరిని చూస్తే వారి వయసు అస్సలు కనిపించదు. కానీ  మరికొంత మంది మాత్రం చిన్న వయసులోనే చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తారు. ఒక్కోసారి ఫిట్‌నెస్ సరిగా లేకపోవడం, ఒక్కోసారి ఆరోగ్యం, అందం పట్ల వారు చూపే నిర్లక్ష్యం వల్ల పెద్దగా కనిపిస్తారు.

వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించే ఓ మహిళ ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలుస్తోంది. చైనాకు చెందిన ఈ మహిళ తన అద్భుతమైన ఫిట్‌నెస్ తో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ వయసులో చాలా మంది 2 కిలోమీటర్లు కూడా నడవడం కష్టంగా ఉంటుంది, కానీ ఈమె మాత్రం ప్రతిరోజూ జిమ్ కు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అమ్మమ్మ ఫిట్‌నెస్ ఆశ్చర్యపరిచింది

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించిన నివేదిక ప్రకారం, ఈ మహిళ పేరు బావో షాలింగ్. ఆమె వయస్సు 60 సంవత్సరాలు. ఆమె జియాంగ్షు ప్రావిన్స్‌లో నివసిస్తోంది. ఈ వయస్సులో కూడా ఆమె పార్ట్ టైమ్ కార్డియో ట్రైనర్ గా.. 5 జిమ్‌లలో ఈ పని చేస్తుండడం చెప్పుకోదగిన విషయం. ఆమె 38 సంవత్సరాల వయస్సులో బరువు తగ్గడానికి ఏరోబిక్స్ క్లాస్‌లలో చేరినప్పుడు ఫిట్‌నెస్ శిక్షణపై తీవ్ర పట్టు సాధించింది. అదే సమయంలో కోచ్ కంటే ఆమె చేసే కసరత్తులు హయ్యెస్ట్ బేస్ లో ఉన్నాయని చాలా మంది కూడా ఆమెకు చెప్పారు.

ఆమె ఫిట్‌నెస్‌ని ఎలా మెయింటైన్ చేస్తుందంటే..

బావో రోజూ.. ఉదయం 7.30 గంటలకు నిద్రలేచి, అల్పాహారానికి ముందు వర్కవుట్ చేస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఐరన్ ను పంపు చేస్తుంది. ఈ వయస్సులో కూడా ఆమె నడుము 27 అంగుళాలు ఉందంటే అతిశయోక్తి కాదు. 20 సంవత్సరాల వయస్సులో ఆమె నడుము 25 అంగుళాలు ఉండేదట. అంతే కాదు ఆమె అభిమానుల్లో అత్యధికులు 20-25 ఏళ్ల మధ్య వయస్కులే. ఫిట్‌నెస్ తన జీవితంలో ఒక భాగమని, అది మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుందని ఆమె చెబుతోంది.