వీడియో : ఎంత ముచ్చటగా డాన్స్ చేశారు.. ఐస్ క్రీం ఫ్రీ అంటే..

వీడియో : ఎంత ముచ్చటగా డాన్స్ చేశారు.. ఐస్ క్రీం ఫ్రీ అంటే..

ఏదైనా ఫీల్ గుడ్ ఉండాలి బాస్..  జీవితం అన్నాక.. ఎప్పుడూ పనేనా.. కొంచెం రిలాక్స్ అలా ఐస్ క్రీం కోసం వెళితే.. అక్కడ ఊహించని ఓ బోర్డు కనిపిస్తే.. ఇంకేముందీ చిన్నా.. పెద్దా.. కుర్రకారు అందరూ పోటీ పడి మరీ డాన్స్ చేశారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటారా..? . ఐస్ క్రీం డే సందర్భంగా.. షాపునకు వచ్చే కస్టమర్లకు ఓ ఆఫర్ ప్రకటించింది యాజమాన్యం. 

ఫ్రీగా స్కూప్ ఐస్ క్రీం కావాలంటే.. మా కౌంటర్ ముందు డాన్స్ చేయాలి అని.. అంతే కుర్రోళ్లు అందరూ కౌంటర్ దగ్గర తమ డాన్స్ టాలెంట్ చూపించేశారు. ఎంత బాగా చేశారో తెలుసా.. అద్భుతం. పాప్, ర్యాప్ సాంగ్స్ కు అద్దిరిపోయే విధంగా డాన్సులు చేశారు. పెద్దలు కూడా తమ డాన్స్ టాలెంట్ చూపించి ఐస్ క్రీం ఫ్రీగా తినేశారు. 

కొందరు అయితే మొహమాటానికి డాన్స్ చేయలేదు కానీ.. యూత్ అయితే మాత్రం కౌంటర్ దగ్గర డాన్స్ చేస్తూ ఫ్రీ ఐస్ క్రీంతో ఎంజాయ్ చేశారు. ఇది పబ్లిసిటీ కోసం కాదులేండీ.. ఎన్నో ఏళ్లుగా ఐస్ క్రీం షాపు నడుపుతున్న  కార్నర్ హౌస్ ఐస్ క్రీం మాల్.. ఐస్ క్రీం దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. రెగ్యులర్ ఐస్ క్రీం కోసం వచ్చే వారు.. ఆ రోజు మాత్రం డాన్స్ చేసి ఎంజాయ్ చేసేశారు. 

కౌంటర్ దగ్గర డాన్స్ చేసిన వీడియోను కార్నర్ ఐస్ క్రీం ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. లవ్ యూ ఆల్.. ఫన్ విత్ కూల్ అంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను మీరూ వాచ్ చేయండి.. ఎంజాయ్ చేయండి.. జస్ట్ చిల్ బాసూ.