బుల్లెట్ బండిపై అమ్మవారు.. కమ్మని ప్రసాదాలతో పూజలు

బుల్లెట్ బండిపై అమ్మవారు.. కమ్మని ప్రసాదాలతో పూజలు

ఏ దేశంలో లేనంతగా భారతదేశంలోని ప్రజలు పండుగలు జరుపుకుంటారు. ప్రతీ సీజన్ లోనూ ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది. భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ.. ఉల్లాసంగా గడుపుతూంటారు కూడా. అందులో భాగంగా ఈ వర్షాకాలంలో జరుపుకునే కొన్ని ప్రసిద్ధి పండుగల్లో పెరుక్కు ఒకటి. దీన్నే ఆది మాన్‌సూన్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఈ తమిళ సంప్రదాయ పండుగ తమిళ నెలలోని ఆది 18వ రోజున జరుపుకుంటారు. మన క్యాలెండర్ ప్రకారం, ఈ నెల జూలై 16న ప్రారంభమై ఆగస్టు 16న ముగుస్తుంది.

ALSO READ :తిక్క కుదిరింది.. పట్టించుకోలేదని ఆఫీసుకు పాము తెచ్చిండు

తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలోని సమర్థ్మపురంలో ఉన్న శ్రీ ముత్తుమారి అమ్మన్ ఆలయంలో ఈ పండుగను అపూర్వంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఈ పండుగకు ఆలయ నిర్వాహకులు ఓ మోడ్రన్ ట్విస్ట్ ను జోడించాలని నిర్ణయించింది. ముత్తుమారి దేవి భక్తుల కోసం ఒక స్టేజిపై బుల్లెట్ బైక్‌పై కూర్చుని ఉంది. ఆమెను భారీ పూల దండలు, ఆభరణాలతో అలంకరించారు. కరెన్సీ నోట్లను పూలపై ఉంచారు. ఈ విశిష్టమైన ఆలోచన భక్తుల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఈ క్రమంలోనే వారు ప్రార్థనలు చేయడానికి, అమ్మవారి నుంచి ఆశీర్వాదం పొందేందుకు తరలి వస్తున్నారు.

ముత్తుమారి అమ్మన్ దేవత సుబ్రహ్మణ్య భగవానుని దైవిక భార్యగా భక్తులు నమ్ముతారు. ముత్తుమారి అమ్మన్‌ను బిడ్డగా భావించి కన్య దేవతగా పూజిస్తారు. వివాహం చేసుకోవాలనుకునే భక్తులు సంప్రదాయబద్ధంగా మంగళ సూత్రం సమర్పించే బదులు ఆమె పాదాల వద్ద బంగారు ముత్యాన్ని సమర్పిస్తారు. ఆమె నాలుగు చేతులతో త్రిశూలం, పుర్రె, సర్పం, డమరు (చిన్న డ్రమ్) పట్టుకుని ఉంటుంది.

ఆది మాసంలోని పూరం నక్షత్రం అమ్మవారి జన్మదినమైనందున ఆది వర్షాకాలం పండుగ ఆండాల్ నాచియార్‌గా జరుపుకుంటారు. భారతదేశంలో ఇలాంటి విచిత్రమైన లేదా రహస్యమైన కథలతో పేరొందుతున్న ఆలయాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడి ప్రజల నమ్మక ఆధారంగా నిర్మించబడ్డాయి.