కూకట్​పల్లి రైతుబజార్​లో ఏటీబీ మిషన్ ప్రారంభం

కూకట్​పల్లి రైతుబజార్​లో ఏటీబీ మిషన్ ప్రారంభం

కూకట్​పల్లి, వెలుగు: కేపీహెచ్​బీ కాలనీలోని కూకట్​పల్లి రైతుబజార్​లో ఏర్పాటు చేసిన ఏటీబీ(ఎనీ టైమ్ బ్యాగ్) మెషీన్​ను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్​ మమత, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మూసాపేట సర్కిల్ డీసీ రవికుమార్​ పాల్గొన్నారు. మార్కెట్​కు వచ్చే కొనుగోలుదారులు10 రూపాయల నోట్ పెడితే, ఏటీబీ ఒక కాటన్​ బ్యాగ్ ఇస్తుంది. ఇటీవల బాలానగర్​లో ఏర్పాటు చేయగా మంచి రెస్పాన్స్​ వచ్చింది. దీంతో కూకట్​పల్లిలో ఏర్పాటు చేశారు.