
హైదరాబాద్, వెలుగు: ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌ను నల్గొండలోని మారిగూడలో ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను వీటీ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఎండీ తేజ పవన్ కుమార్ మాట్లాడుతూ, ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో తమకు ఏథర్ షోరూమ్ ఉందని, అక్కడ తమ పనితీరు నచ్చడంతో నల్గొండలో కూడా షోరూమ్ ఏర్పాటుకు అవకాశం వచ్చిందని తెలిపారు. పెట్రోల్ ఖర్చు లేకపోవడంతో అన్ని వర్గాలూ ఈవీలను ఆదరిస్తున్నాయని చెప్పారు.