
ఇన్‌ఫ్లుయెన్సర్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చాలామంది మొబైల్ కెమెరాలతోనే వీడియోలు తీస్తుంటారు. అలాంటివాళ్లు వాన కురుస్తున్నప్పుడు వీడియో తీయాలంటే కాస్త ఇబ్బందే. అలాంటివాళ్లకు ఈ మొబైల్ గొడుగు బాగా పనికొస్తుంది. దీన్ని అటోర్స్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
దీని హ్యాండిల్‌కి సెల్‌ఫోన్‌ను బిగించడానికి ప్రత్యేకంగా హోల్డర్ ఉంటుంది. దానికి ఫోన్‌ని పెట్టి బిగిస్తే అస్సలు తడవదు. వర్షంలో కూడా వీడియో రికార్డింగ్, ఫొటో షూట్ చేసుకోవచ్చు. దీని తయారీలో ప్రీమియం పాలిస్టర్‌తో తయారుచేసిన సన్‌షేడ్ వాడారు. కాబట్టి చాలా మన్నికగా ఉంటుంది. ఇది వర్షం నుంచి మాత్రమే కాదు.. ఎండ, ధూళి నుంచి కూడా ఫోన్‌ని కాపాడుతుంది.
ధర : రూ. 906