ఉప్పల్ లో కత్తి పోట్ల కలకలం.. బీజేపీ నేతపై దాడి

 ఉప్పల్ లో కత్తి పోట్ల కలకలం.. బీజేపీ నేతపై దాడి

ఉప్పల్ లో కత్తి పోట్లు కలకలం సృష్టించాయి.  ఉప్పల్ భగాయత్ వద్ద  నిర్మానుష్య ప్రాంతంలో  జాతీయ హిందీ సలహాదారు కమిటీ సభ్యులు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛభారత్ అభియాన్ కన్వీనర్ ఉదయ్ భాస్కర్ గౌడ్ పై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఉదయ్ భాస్కర్ గౌడ్ ను స్థానికుల ఆసుపత్రికి తరలించారు.  

సమాచారం అందుకున్న పోలీసులు..  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  బోడుప్పల్‌కు చెందిన ఉదయ్ భాస్కర్ గౌడ్ మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వారితో పరిచయాలు ఉన్నాయి.