విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడి.. ముగ్గురిపై కేసు

విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడి.. ముగ్గురిపై కేసు

మెహిదీపట్నం, వెలుగు: కరెంట్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ శాఖ సిబ్బందిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఎస్సై ఆదిల్ రియాజ్ ఖాన్ తెలిసిన వివరాల ప్రకారం.. గత నెల 30న దత్తాత్రేయనగర్ మహబూబ్ కాలనీలో కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది. 

ఈ క్రమంలో కరెంట్ సప్లయ్​ను పునరుద్ధరించడంలో ఆలస్యం కావడంతో విద్యుత్ సిబ్బంది సతీశ్, విశాల్​పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. బాధితులతో పాటు సీబీడీ వింగ్ ఏడీ వంశీ కృష్ణ కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్​ల ఆధారంగా నిందితులు మహమ్మద్ ఆజామ్​తో పాటు మరో ఇద్దరిని గుర్తించారు.  పరారీలో ఉన్నవారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.