Viral Video: చీరల కోసం అర్థరాత్రి నుంచే క్యూ.. ఫ్రీ కాదు.. అందరూ డబ్బున్న మహిళలే.. ఎక్కడంటే..?

Viral Video: చీరల కోసం అర్థరాత్రి నుంచే క్యూ.. ఫ్రీ కాదు.. అందరూ డబ్బున్న మహిళలే.. ఎక్కడంటే..?

షాపింగ్ మాల్ దగ్గర లేదా చీరల దుకాణం దగ్గర లేడీస్ క్యూలో ఉన్నారంటే.. ఠక్కున గుర్తుకొచ్చేది ఏంటీ.. చీరలు ఫ్రీగా ఇస్తున్నారా లేక 50, 100 రూపాయలకే చీరలు ఇస్తున్నారా అనే ఆలోచన.. ఇప్పుడు చెప్పబోయేది తెలిస్తే మాత్రం కచ్చితంగా అవాక్కవుతున్నారు.. అక్కడ చీరలు ఫ్రీగా ఇవ్వటం లేదు.. ఒక్కో చీర ప్రారంభం ధర 3 వేల రూపాయలు.. అత్యధిక ధర 2 లక్షల రూపాయలు.. అంత ధర పెట్టి చీర కొనటానికి.. అర్థరాత్రి నుంచే క్యూలో నిలబడ్డారు మహిళలు.. వాళ్లందరూ డబ్బున్న మహిళలే.. అవును నిజం.. ఇది ఎక్కడ.. ఆ చీర ప్రత్యేకత ఏంటీ అనేది తెలుసుకుందామా...

కర్ణాటకలో మైసూర్ సిల్క్ చీరలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా బెంగళూరులోని కర్ణాటక సిల్క్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(KSIC) షోరూమ్ బయట కనిపించిన దృశ్యాలు చూస్తుంటే ఇది చీరల షాపా లేక ఐఫోన్ లాంచింగ్ ఈవెంటా? అన్న అనుమానం మీకు కలగక మానదు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే.. ఇంకా సూర్యుడు కూడా ఉదయించక ముందే వందలాది మంది మహిళలు, కుటుంబ సభ్యులు క్యూలైన్లలో బారులు తీరారు సిల్క్ చీరల కోసం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు చూసిన వాళ్లు ఈ చీరల పిచ్చేంటిరా నాయనా మహిళలకు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ALSO READ : 2030 నాటికి అప్పర్ మిడిల్ ఇన్కమ్ దేశంగా భారత్..

ఒక్క చీర కోసం ఇంత యుద్ధమా? 
మైసూర్ సిల్క్ అంటేనే ఒక రాయల్ లుక్. అందుకే ఎంత రేటైనా వీటిని కొనేందుకు మహిళలు పోటీ పడుతుంటారు. అయితే ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందట. కేవలం KSIC కి మాత్రమే అసలైన మైసూర్ సిల్క్ తయారు చేసే జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) ట్యాగ్ ఉంది. తయారీ సామర్థ్యం తక్కువగా ఉండటం.. నైపుణ్యం కలిగిన నేతగాళ్ల కొరత కారణంగా షోరూమ్‌లలో స్టాక్ చాలా పరిమితంగా ఉంటోంది. దీంతో కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా ఇలాంటి జాతర షోరూం ముందు సర్వసాధారణంగా మారిపోతోంది. 

ALSO READ : స్టాక్ మార్కెట్ ఢమాల్.. రూ.10 లక్షల కోట్లు ఆవిరి..

టోకెన్ ఉంటేనే ఎంట్రీ.. ఒక్కరికి ఒక్కటే చీర 
చీరల అభిమానులను నియంత్రించడానికి KSIC యాజమాన్యం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కేవలం టోకెన్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తోంది. అది కూడా ఒక్కొక్కరికీ ఒక్క చీరను మాత్రమే కొనేందుకు అవకాశం కల్పించారు. బల్క్ బుకింగ్స్‌ను అరికట్టి.. అందరికీ చీరలు అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రూ.3వేల నుంచి మొదలై రూ.2 లక్షల వరకు ఉండే ఈ సిల్క్ శారీల కోసం తెల్లవారుజాము నుంచే మహిళలు క్యూలైన్లలో నిలబడటం సైషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ALSO READ : 91 మార్కు దాటిన రూపాయి

ఈ క్యూలైన్లను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇది ఇండియాలో ఆపిల్ స్టోర్ కాదు.. కర్ణాటక గవర్నమెంట్ శారీ షోరూమ్. టోకెన్ ఉంటేనే ఎంట్రీ.. ఒక కస్టమర్‌కు ఒక్కటే చీర. ఏంటో ఈ మోనోపోలీ బాస్" అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. మరికొందరు దీన్ని "ఐఫోన్ లాంచ్ బూమర్ వెర్షన్" అని సరదాగా కామెంట్ చేశారు. పెళ్లిళ్ల సీజన్, వరలక్ష్మి వ్రతం వంటి పండుగల సమయంలో ఈ డిమాండ్ ఇంకా రెట్టింపు అవుతుండటంతో.. కనీసం ఒక్క మైసూర్ సిల్క్ శారీనైనా సొంతం చేసుకోవాలని చాలా మంది మహిళలు భావిస్తుండటంతో నచ్చిన చీర కొనుక్కోవటం బెంగళూరులో ఒక పెద్ద టాస్క్‌గా మారిపోయింది.