V6 News

ఎలుకగూడెం సర్పంచ్ పై దాడి

ఎలుకగూడెం సర్పంచ్ పై దాడి

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం ఎలుకగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్యపై మాజీ సర్పంచ్ రాంరెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డారు. శనివారం ఈదమ్మ జాతర సందర్భంగా ఎద్దులబండ్ల ఊరేగింపును సర్పంచ్ ప్రారంభిస్తుండగా.. నర్సింలు, సురేశ్, ప్రశాంత్ ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బందెయ్యను వెంటనే షాద్​నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాధితుడిని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరామర్శించారు. ప్రజాప్రతినిధిపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.