జీతాలియ్యట్లేదని ఐఫోన్ ఫ్యాక్టరీపై దాడి

జీతాలియ్యట్లేదని ఐఫోన్ ఫ్యాక్టరీపై దాడి

ఐఫోన్​ తయారీ కంపెనీపై రాళ్లేసిన ఉద్యోగులు.. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం

కోలార్(కర్నాటక): నెలనెలా ఇవ్వాల్సిన జీతం 4 నెలల నుంచి ఇవ్వకపోవడంతో కడుపు మండిన ఉద్యోగులు ఫ్యాక్టరీపై దాడి చేసిన్రు.. కంటికి కనబడిన వస్తువులను నాశనం చేసిన్రు. ఫ్యాక్టరీ ముందున్న వెహికల్స్​కు నిప్పు పెట్టి, లోపలున్న ఫర్నిచర్​ను ధ్వంసం చేసిన్రు. దీంతో కంపెనీకి పెద్దమొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది. కర్నాటకలోని కోలార్​ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు.. కోలార్​ జిల్లా నరసాపుర ఇండస్ట్రియల్​ ఏరియాలో విస్ట్రాన్​ కార్పొరేషన్​ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఐఫోన్​లను తయారుచేస్తది. లాక్​డౌన్​ ఎఫెక్టో మరేంటో కానీ ఉద్యోగుల జీతాల చెల్లింపులో మేనేజ్​మెంట్​ నిర్లక్ష్యం ప్రదర్శించింది. నెలా రెండు నెలలు కాదు.. 4 నెలల పాటు జీతాలే ఇవ్వలే. దీంతో ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నరు. నెలనెలా టైమ్​కు జీతమొస్తేనే నెలాఖరులో ఇబ్బందులు తప్పట్లేదు.. అలాంటిది నెలల తరబడి జీతాలివ్వకుంటే ఎట్లా బతకాలని ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమైంది. శనివారం రోజు అది కాస్తా ఆగ్రహంగా మారింది. వేలమంది ఉద్యోగులు మూకుమ్మడిగా కంపెనీ ప్లాంట్​పై దాడి చేశారు. కంపెనీలోని విలువై న ఫర్నీచర్​ను, వస్తువులను నాశనం చేశారు.  సెక్యూరిటీ సిబ్బంది సమాచారమివ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీచార్జి చేసి, ఉద్యోగులను అక్కడి నుంచి తరిమేశారు. ఉద్యోగులు ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్​ కాదని, సమస్యల పరిష్కారానికి వేరే వేదికలు ఎన్నో ఉన్నాయని కోలార్​ ఎస్పీ కార్తిక్​ రెడ్డి చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేసిన ఉద్యోగులను గుర్తించి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

For More News..

ట్రంప్‌కు న్యాయపరంగా దారులన్నీ క్లోజ్

హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌‌లో మరోసారి విభేదాలు

అయ్యప్పా.. నీ దర్శనమెట్లా!