సిగరెట్ ఉద్దెర ఇవ్వనందుకు షాపు యజమానిపై దాడి

V6 Velugu Posted on Oct 17, 2021

సిగరెట్ ఉద్దెరకు ఇవ్వనందుకు షాపు యజమానిపై దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వెలుగుచూసింది.  పట్టణంలోని పూసాలలో  సిగరేటు ఉద్దెర ఇవ్వనందుకు ఓ యువకుడు గంజాయ్ మత్తులో షాపు యాజమాని మీద దాడి చేశాడు. గొడుగుతో షాపు యజమాని పడల ప్రసాద్  గొంతుపై పొడిచాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రసాద్ ను సుందరయ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Tagged Peddapalli, credit, sulthanabad, Cigarette, attack on shop owner

Latest Videos

Subscribe Now

More News