మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో కాంటా పెడ్తలేరని.. వడ్లకు నిప్పు పెట్టే యత్నం

మహబూబాబాద్  జిల్లా నర్సింహులపేటలో కాంటా పెడ్తలేరని.. వడ్లకు నిప్పు పెట్టే యత్నం

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్  జిల్లా నర్సింహులపేటలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ఓ రైతు వడ్ల కుప్పకు నిప్పంటించేందు ప్రయత్నించాడు. మండల కేంద్రానికి చెందిన రైతు అంకం రామకృష్ణ వడ్లను ఏప్రిల్ 15న కొనుగోలు సెంటర్​కు తీసుకొచ్చాడు.

వడ్లు పూర్తిగా ఎండబెట్టి, నిబంధనల మేరకు తేమ శాతం వచ్చినా వడ్లను కాంటా పెట్టకుండా, తరువాత వచ్చిన వడ్లను తూకం వేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం వడ్ల కుప్పపై పెట్రోల్​ పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. గమనించిన పక్క రైతులు ఆయనను అడ్డుకున్నారు. సెంటర్​ సిబ్బంది డబ్బులు ఇచ్చిన రైతుల వడ్లు కాంటా వేస్తున్నారని పేర్కొన్నాడు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు.