జ్వరంతో.. యువకుడు మృతి

జ్వరంతో.. యువకుడు మృతి

ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ వికటించడమే కారణమని ఆందోళన

పర్వతగిరి (సంగెం), వెలుగు : జ్వరంతో బాధపడుతున్న యువకుడిని ఓ డాక్టర్‌‌‌‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి సీరియస్‌‌‌‌ కావడంతో వరంగల్‌‌‌‌ ఎంజీఎంకు తరలిస్తుండగా యువకుడు చనిపోయాడు. డాక్టర్‌‌‌‌ చేసిన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ వికటించడం వల్లే యువకుడు చనిపోయాడని అతడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో గురువారం జరిగింది. 

ఉత్తరప్రదేశ్‌‌‌‌కు చెందిన ఆకాశ్‌‌‌‌ పరివార్‌‌‌‌(18) ఐదేళ్లుగా కుటుంబంతో కలిసి వచ్చి తీగరాజుపల్లిలో ఉంటున్నాడు. ఆకాశ్‌‌‌‌కు మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో బుధవారం గ్రామంలోని కరుణశ్రీ హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్‌‌‌‌ కుమారస్వామి సెలైన్‌‌‌‌ పెట్టడంతో ఆకాశ్‌‌‌‌ చలితో వణికిపోయాడు. 

వెంటనే ఎంజీఎంకు తరలించగా అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ గురువారం చనిపోయాడు. అయితే కరుణశ్రీ హాస్పిటల్‌‌‌‌లో డాక్టర్‌‌‌‌ చేసిన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ వికటించడం వల్లే ఆకాశ్‌‌‌‌ చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌‌‌ ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. స్థానికులు నచ్చజెప్పడంతో ధర్నా విరమించి అంత్యక్రియలు పూర్తి చేశారు.