
తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూ గుర్తింపును తెచ్చుకున్న అతుల్య రవి.. ‘మీటర్’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కాదూరి దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అతుల్య రవి మాట్లాడుతూ ‘కథ చెప్పినప్పుడే బాగా నచ్చింది. ఇదొక కమర్షియల్ మూవీ. మాస్ ఫైట్స్, లవ్, రొమాన్స్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎమోషన్స్‌కు అందరూ కనెక్ట్ అవుతారు.
సాంగ్స్ బాగా కుదిరాయి. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అబ్బాయిలు అంటే ఇష్టం లేని పాత్రలో సీరియస్‌గా కనిపిస్తాను. అందులో నుంచే కామెడీ జనరేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హ్యూమర్‌తోనే ఉంటుంది. కిరణ్ పరిచయం కాకముందు ఆయన నటించిన ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ సినిమా చూశా. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందుకే మా కాంబినేషన్ సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. సెకెండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. తెలుగులో కొత్త చిత్రాలేవీ కమిట్ అవలేదు. తమిళంలో ‘డీజిల్’ అనే సినిమా చేస్తున్నా. మరికొన్ని డిస్కషన్స్‌లో ఉన్నాయి’ అని చెప్పింది.