న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పది రాష్ట్రాల్లోని 19 ఖనిజ బ్లాకుల వేలాన్ని ప్రారంభించింది. రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బీహార్ రాష్ట్రాల్లోని లిథియం, అరుదైన భూ మూలకాల నిక్షేపాలు ఇందులో ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ, తయారీ, ఎరువుల రంగాల్లో దేశీయ లభ్యతను పెంచడం ఈ వేలం ప్రధాన ఉద్దేశం.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఢిల్లీలో సోమవారం ఏడో విడత వేలాన్ని ప్రారంభించారు. బీహార్‌లో నాలుగు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో మూడు చొప్పున బ్లాకులు ఉండగా రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చొప్పున ఉన్నాయి. వేలం నిబంధనలను సవరిస్తూ బ్యాంక్ గ్యారెంటీలకు బదులుగా ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్లను అనుమతించారు.
