
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మూవీపై అంచనాలు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే వన్ ఇయర్ టైమ్ తీసుకున్నాడు అంటే.. అర్థమవుతోంది సుక్కు ఏదో భారీగానే ప్లాన్ చేస్తున్నాడని.
ఇక ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప-2 వీడియో గ్లింప్స్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా ఒక రేంజ్ లో వచ్చింది. ఈ ఒక్క వీడియోతో.. ఈ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్‌కు చేరుకున్నాయి. దీంతో.. రిలీజ్ తరువాత ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా మరో ఆల్‌టైమ్ రికార్డుని క్రియేట్ చేసింది. పుష్ప-2 మూవీ ఆడియో రైట్స్ ను టీ-సిరీస్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏకంగా రూ.65 కోట్ల ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే.. ఒక సినిమా ఆడియో రైట్స్ కి ఇంత భారీ రేటు రావడంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇది హయ్యెస్ట్‌గా కూడా. దీంతో.. రిలేజ్ కి ముందే పుష్ప రికార్డుల వేట మొదలైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ ఫాన్స్. ఇక పుష్ప-2 మూవీలో అల్లు అర్జున్ మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.