ఆగస్టు 5.. ‘కాశ్మీర్‌.. అయోధ్య’ టెన్షన్లకు ఫుల్‌స్టాప్

ఆగస్టు 5.. ‘కాశ్మీర్‌.. అయోధ్య’ టెన్షన్లకు ఫుల్‌స్టాప్

ఆగస్టు 5వ తేదీన రెండు చారిత్రాత్మక ఘటనలకు ఇండియా వేదిక కాబోతోంది. కిందటేడాది ఇదే రోజున ఆర్టికర్టిల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్, లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో దశాబ్దాల కాశ్మీర్ సమస్య ముగిసింది. సుప్రీం కోర్టు కిందటేడాది నవంబర్లోబాబ్రీ మసీదు, రామ జన్మభూమి స్థల వివాదాన్ని పరిష్కరించింది. దీంతో నేడు శ్రీ రాముని ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరుగుతోంది. ఈ రెండు చారిత్రక ఘటనలకు ఆగస్టు 5వ తేదీ సాక్ష్యంగా నిలువనుంది. దేశంపై చాలా ప్రభావం చూపించిన “జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికర్టిల్ 370”, “అయోధ్య రామజన్మ భూమి వివాదం” అంశాలను పరిష్కరించడం ద్వారా దేశంలో టెన్షన్లకు ఫుల్‌స్టాప్‌ పడింది.

ఆర్టికల్ 370 – రద్దు

ఆర్టికర్టిల్‌ 370, ఆర్టికర్టిల్‌ 35ఏ ప్రకారం రక్షణ, ఆర్థికర్థి, విదేశాంగ, సమాచార వ్యవహారాలు మినహా మిగిలిన అన్ని రంగాల్లోరాష్ట్రానికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇలాంటి ఆర్టికర్టిల్ 370 పట్లరాజ్యాంగ నిర్మా త బీఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అట్లనే ఆర్టికర్టిల్ 370ని “రాజ్యాంగ నిర్మాతలు చేసిన పొరపాటు”గా బీజేపీ చెబుతుంది. 2015 డిసెంబర్‌లో ఆర్టికర్టిల్ 370పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అప్పుడు “దీన్ని రాజ్యాంగం నుంచి తొలగించే నిర్ణ‌యం పార్ల‌మెంటే తీసుకోగలదని‌ కోర్టు చెప్పింది. కిందటేడాది ఆగస్ట్ 5న ఆర్టికర్టిల్ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

అయోధ్య వివాదానికి సరైన పరిష్కారం

అయోధ్య వివాదంపై కిందటేడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు చెప్పింది. వివాదంలో ఉన్న స్థలం తమదేనంటూ ముస్లిం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు.. ఆ స్థలంలో రామ మందిరం నిర్మించాల్సిందిగా స్పష్టం చేసింది. ముస్లింలకు మరోచోట 5 ఎకరాల భూమి కేటాయించాలంది. దీంతో రామజన్మభూమి లో మందిరానికి మార్గం సుగమం అయ్యింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం