కూతురుతో కలిసి అల్లుడింట్లో అత్త చోరీ

కూతురుతో కలిసి అల్లుడింట్లో అత్త చోరీ

అల్లుడింట్లో అత్త చోరీ

అప్పులు తీర్చేందుకు కూతురుతో కలిసి ప్లాన్‌‌‌‌‌‌‌‌  

సీసీటీవీ ఫుటేజీతో పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కూతురు పెండ్లికి చేసిన అప్పులు తీర్చలేక కూతురుతో కలిసి అల్లుడింట్లో తల్లి చోరీ చేసింది. రూ. 22 లక్షల విలువైన బంగారం, వెండి కొట్టేసింది. సీసీటీవీ కెమెరాలతో పోలీసులుకు చిక్కింది. మేడ్చల్‌‌‌‌‌‌‌‌ జిల్లా యాప్రాల్‌‌‌‌‌‌‌‌ కింది బస్తీకి చెందిన వాసగోని వెంకటస్వామి కల్లు వ్యాపారం చేస్తుంటాడు. కొడుకులు వేణు, విక్రమ్‌‌‌‌‌‌‌‌, విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌తో ఒకే ఇంట్లో ఉంటున్నారు. విశ్వనాథ్‌‌‌‌‌‌‌‌కు 2016లో సోని అనే యువతితో మ్యారేజైంది. పెండ్లి ఖర్చుల కోసం సోని తల్లి లీలావతి తన ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ను రూ. 30 లక్షలకు మార్టగేజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆ తర్వాత అప్పుల్లో చిక్కుకుంది. వాటిని తీర్చేందుకు ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ లేక కూతురు సోనితో కలిసి అల్లుడింట్లోనే చోరీకి ప్లాన్ చేసింది.

అల్లుడింట్లో వాళ్లు పెండ్లికి వెళ్లడంతో..

కందికల్‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 23న జరిగిన ఓ పెండ్లికి అల్లుడి ఇంట్లో వాళ్లు వెళ్లడాన్ని లీలావతి చాన్స్‌‌‌‌‌‌‌‌గా తీసుకుంది. రాత్రి 7.15 గంటల టైమ్‌‌‌‌‌‌‌‌లో సోనితో కలసి స్కూటీపై యాప్రాల్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. అల్మారాలో ఉన్న 44 తులాల గోల్డ్, 15 తులాల వెండితో పాటు రూ. 10,500 క్యాష్‌‌‌‌‌‌‌‌ చోరీ చేసింది. అనుమానం రాకుండా మరో అల్మారా తాళాలను పగులగొట్టి చోరీ సీన్‌‌‌‌‌‌‌‌ క్రియేట్ చేసింది. రాత్రి 11.15 గంటలప్పుడు సోనీ మామ యాప్రాల్‌‌‌‌‌‌‌‌లోని ఇంటికి వచ్చాడు. చోరీ విషయం తెలుసుకొని జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి సీసీఎస్‌‌‌‌‌‌‌‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు. స్కూటీ నంబర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సోనీ, ఆమె తల్లి లీలావతిని గుర్తించి విచారించారు. దాచిన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు.

For More News..

అధికార పార్టీకి ఇండిపెండెంట్ల టెన్షన్

ఇవ్వాల ఉన్నం.. రేపు ఉంటమో లేదో.. దోస్త్​కు మెసేజ్‌ చేసిన తెల్లారే టెర్రరిస్టుల దాడిలో సోల్జర్ మృతి

ఒక్క చాన్స్​ ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం