Rashmika Vijay Wedding: గాసిప్పా.. గ్రాండ్ వెడ్డింగా?.. రష్మిక–విజయ్ పెళ్లి తేదీ, లొకేషన్‌పై క్లారిటీ!

Rashmika Vijay Wedding: గాసిప్పా.. గ్రాండ్ వెడ్డింగా?.. రష్మిక–విజయ్ పెళ్లి తేదీ, లొకేషన్‌పై క్లారిటీ!

ప్రస్తుత కాలంలో మోస్ట్ ట్రెండింగ్ స్టార్స్ అంటే టక్కున గుర్తొచ్చే జంట రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ (Rashmika Vijay). టాలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా వీరిద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో వీరి వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.

ఇప్పటికే రష్మిక-విజయ్ మధ్య ప్రేమాయణం నడుస్తుందనే, నిశ్చితార్ధం జరిగిందనే ప్రచారం జరుగుతుంది. కలిసి సినిమాలు చేయడం, ఒకే తరహా లొకేషన్లలో కనిపించడం, సోషల్ మీడియాలో పరోక్ష సంకేతాలు ఇవ్వడం వంటి అంశాలతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. ఈ క్రమంలో మరోసారి వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. 

రష్మిక-విజయ్ పెళ్లి:

లేటెస్ట్గా రష్మిక-విజయ్ దేవరకొండ.. 2026, ఫిబ్రవరి 26న వివాహం చేసుకోబోతున్నారని సినీ వర్గాల సమాచారం. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, నిరాకరించనూ లేదు. కానీ, తమ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలను నిజమని నమ్మి, ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వార్తలు నిజమా? లేక మరోసారి వచ్చిన గాసిప్పా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. అయినప్పటికీ, వీరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చలు కొనసాగిస్తున్నారు.

ALSO READ : ప్రభాస్–రిద్ధి శారీ స్టోరీ.. 

మొత్తానికి, రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ పెళ్లి విషయంపై అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఈ వార్తలను రూమర్స్‌గా మాత్రమే భావించాల్సి ఉంటుంది. అధికారిక ప్రకటన వస్తే మాత్రం, అది టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారడం ఖాయం.

నిశ్చితార్థం!

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నల నిశ్చితార్థ వేడుక ఇప్పటికే నిరాడంబరంగా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. 2025 అక్టోబర్ 3, శుక్రవారం నాడు ఈ జంట ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఈ వార్తను ధృవీకరించడానికి కానీ, ఖండించడానికి కానీ ఇద్దరు నటులు ఇంకా ముందుకు రాలేదు. 

రౌడీ జనార్దన టీజర్:

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్థన’.  కీర్తి సురేష్ హీరోయిన్. రవి కిరణ్ కోలా దర్శకుడు.  దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. ఊరి నడిబొడ్డున, అర్థరాత్రి ఎగిసిపడుతున్న మంటల మధ్య, పదుల సంఖ్యలో శత్రువులు చుట్టుముట్టగా చేతిలో వేట కత్తి,  కండలు తిరిగిన దేహంతో వారిని ఎదిరిస్తూ కనిపించాడు విజయ్ దేవరకొండ.

‘‘ఈ కళింగపట్నంలో ఇంటికొకడు నేను రౌడీని అని చెప్పుకు తిరుగుతాడు.. కానీ ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్థన.. రౌడీ జనార్థన” అంటూ విజయ్ చెప్పిన డైలాగ్‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌కు హైలైట్‌‌‌‌గా నిలిచింది. పూర్తిస్థాయి మాస్‌‌‌‌, యాక్షన్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో సినిమా రాబోతోంది. 

రష్మిక ‘‘మైసా” టీజర్ :

 రష్మిక మందన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘మైసా”. ఇటీవలే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మునుపెన్నడూ కనిపించని సరికొత్త పాత్రలో రష్మిక దర్శనమిచ్చింది. గిరిజన తిరుగుబాటు యువతిగా, ప్రతీకార భావంతో నిండిన పాత్రలో రష్మిక కనిపించిన తీరు ఆకట్టుకుంది. రవీంద్ర పూలే డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా భాషల్లో తెరకెక్కుతుంది. ‘మైసా’ అనే పదానికి “అమ్మ” అనే అర్థం. 2026లో మైసా ప్రేక్షకుల ముందుకు రానుంది.