ఆసీస్ ను వణికిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. అప్పుడే 5 వికెట్లు ఢమాల్

ఆసీస్ ను వణికిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. అప్పుడే 5 వికెట్లు ఢమాల్

ఆఫ్గనిస్తాన్ విసిరిన 292 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు గ్రౌండ్ లోకి దిగిన ఆసీస్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. 13 ఓవర్లలోనే ఆసీస్ ఐదు వికెట్లు పడగొట్టింది ఆఫ్గనిస్తాన్. హక్ 2 వికెట్లు, ఉమర్ జా రెండు వికెట్లు పడగొట్టి.. ఆసీస్ కు వణుకు పుట్టిస్తున్నారు. ఓ రనౌట్ చేసి ఫీల్డింగ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం అనేది హెచ్చరించింది ఆఫ్గనిస్తాన్. 

ఆసీస్ బ్యాటర్లలో కీలకమైన డేవిడ్ వార్నర్, హెడ్, మిచల్ మార్ష్, జోష్ ఇంగ్లీస్, లబుషేన్ త్వరత్వరగా ఔట్ అవ్వటంతో.. కష్టాల్లో పడింది ఆసీస్. 14 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి.. 69 పరుగులు చేసింది. 

ఆఫ్గనిస్తాన్ బౌలర్లు నిప్పులు చెరిగే బాల్స్ వేస్తూనే.. మరో వైపు కళ్లు చెదిరే ఫీల్డింగ్ చేస్తూ.. ఆసీస్ చెమటలు పట్టిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఆసీస్ ను ఆఫ్గన్ మట్టికరిపించటం ఖాయంగా కనిపిస్తుంది.